telugudanam.com

      telugudanam.com

   

కైలాసగౌరి వ్రతము

[ వెనుకకు ]


ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒక రాజునకొక్కతే కుమార్తె గలదు. అతడామెకొక వన్నెల విసనకర్ర వంటి వయ్యారి మగని యేరి తెచ్చి పెండ్లి చేసెను. కాని ఆమె భర్త యెల్లప్పుడు వేశ్యాలోలుడై భార్య ముఖమైనను చూడకుండెను. అందుచేత ఆ రాచ చిన్నది మిక్కిలి బాధపడి, పార్వతీదేవిని ప్ర్రతిదినము పూజించుచు, తన పతిని తనతో కలుపమని ప్రార్ధించుచుండెడిది. అట్లు కొంతకాలము జరిగిన తర్వాత పార్వతీదేవి ఆమె యందు కరుణించి ఒకనాటి రాత్రి ఆమె స్వప్నములో కనిపించి, కైలాసగౌరి నోము నోచినచో భర్తతో యెడబాటు లేకుండునని తెలిపెను. తెల్లవారిన తర్వాత నామె ముందురోజు రాత్రి స్వప్న వృత్తాంతమును తన తండ్రికి తెలిపి, ఆ నోమును నోచుకొనెను. తరువాత నామె భర్త ఆమె యందనురాగము కలవాడై వేశ్యా సంబంధమును వదలు కొనెను. అప్పటి నుండి వారిద్దరు పార్వతీపరమేశ్వరుల వలె జంట విడువకుండ సుఖముగా నుండిరి.


దీనికి వుద్యాపనము

పండుగ దినమున పార్వతీ దేవాలయము నందు లేక నదీ తీరమునందు, ఐదు కుంచముల కుంకుమ, ఐదు కుంచముల పసుపు, పండ్లు, ముత్తైదువులకు పంచిపెట్టవలెను. పంచి పెట్టు నపుడు మాట్లాడరాదు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: