telugudanam.com

      telugudanam.com

   

కన్నె తులసమ్మ వ్రతము

[ వెనుకకు ]


ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒక చిన్నది సవతితల్లి పోరుపడలేక తన అమ్మమ్మగారి యింటికి వెళ్ళిపోయెరు. సవతి తల్లి ఆపిల్లను తీసుకునిరమ్మని భర్తను వేధించెను. కాని యతడందులకంగీకరింపక ఆమెనేవెళ్ళి పిల్లను తీసుకుని రమ్మని చెప్పెను. ఇంకచేయునదిలేక ఆమె సవతి పిల్లను తీసుకొనివచ్చుటకాపిల్ల అమ్మమ్మగారింటికి వెళ్ళి పిల్లను పంపుమని ఆమె తాత నడిగెను. ఎంతో నిష్టూరంమీద ఆమె పిల్లనుతీసుకొనివచ్చెను. ఒకనాడు పిల్లకు తన పిల్లనిచ్చి యెత్తుకొనమని చెప్పి, అరిసెముక్కను పెట్టి తులసెమ్మకు పూజ చేసుకొనెను. అదిచూచి ఆపిల్ల సవతితల్లి వెళ్ళిన తరువాత అరిసెముక్క నైవేద్యముపెట్టి తులసెమ్మనుపూజించెను. ఆచిన్నదాని భక్తికిమెచ్చి, తులసెమ్మ ప్రత్యక్షమై 'చిన్నదానా! నీవు పూర్వ జన్మలో కన్నెతులసెమ్మనోమునోచి వుల్లంఘించుటచేత యీజన్మలో నీకు తల్లి లేకపోయినది. అందుచేతను నీవుకష్టములు పడవలసివచ్చినది. కావున నీవానోమును నోచుకొని సుఖపడుము" అని సెలవిచ్చి మాయమయ్యెను. ఆపిల్ల ఆ నోమును నోచుకొని ఏడాది అయిన తర్వాత నుద్యాపనము చేసుకొనెను. అప్పటి నుండి ఆమె సవతితల్లి కామెయందు ప్రేమకలిగి ఆమెను సొంతబిడ్డవలె చూచుకొనెను.


దీనికి వుద్యాపనము

తులసెమ్మకు పదమూడుజతల అరిసెలు నైవేద్యము పెట్టి పూజచేసి, ఒకకన్యకు తలంటి నీళ్ళుపోసి, పరికిణీ రవికె లిచ్చి, అరిసెలు వాయనమియ్యవలె.


మూలం: స్త్రీలవ్రత కథలు, మారిశెట్టి నాగేశ్వరరావు, శ్రీ సీతారామా బుక్ డిపో.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: