telugudanam.com

      telugudanam.com

   

శ్రీకృష్ణాష్టమి వ్రతకధ

[ వెనుకకు ]


శ్రీకృష్ణాష్టమి

బ్రహ్మలోకములో లోకోపకారం కోసం నారదుడు, కర్త అయిన బ్రహ్మదేవుని సందర్శించి, సర్వసౌభాగ్యములు ఇచ్చే శ్రీకృష్ణాష్టమి వ్రత ప్రాశస్త్యమును చెప్పమని కోరాడు. వత్సా నారదా! కలి కల్మషములను నశింపజేసే శక్తిగల శ్రీకృష్ణాష్టమి వ్రతం అశ్వమేధయాగం చేసినంత ఫలము కలుగును. అన్ని తీర్థముల యాత్ర చేసినంత సాఫల్యం పొందుతారు. కృష్ణ జయంతి రోజున పూజచేసి ఉపవాసం, ఓ జాగరణ చేయువారికి వేయి కపిల గోవులను, వెయ్యి ఏనుగులు ఇచ్చిన పుణ్యం,వెయ్యి బంగారు ఆభరణములు, కోటి వస్త్రదానముల ఫలం కలుగుతుంది.

అంబరీష, గాది, దర్మరాజు సత్యసంధులగు అనేకమంది రాజవర్యులు దేవకినందనుడగు శ్రీకృష్ణ భగవాసుని సంతృప్తి కోసం శ్రీకృష్ణజయంతి రోజున ఉపవసించి, సత్ఫలితములు పొంది, రాజ్యసంపదతో, శాశ్వగతిని పొందారు. వాలఖిల్యాదిమునులు వశీష్ఠదులు, గౌతముడు, గార్గుడు, పరుశురాముడు, వాల్మికిముని వీరంతా వ్రతమాచరుంచారు.

జన్మజన్మాంతరాలలో కలిగే బ్రహ్మహత్యల పాపములన్నియు నామస్మరణ, వ్రతము వల్ల నశించును. శ్రావణ మాసంలో రోహీణీ నక్ష్రముతో కూడిన అష్టమి నాడు వ్రతం చేసి ఆ .శ్రీకృష్ణభగవానుని పూజించు వారికి దేవకీదేవి తన పుత్రునితో గూడ ప్రసన్నాంగులయి విష్ణు సాయుజ్యము పొందగలరు. లక్ష్మ్మీప్రసాదముతో భోగ భాగ్యములు పొంది, కుటుంబ వృద్ధి, వ్యాధి నివారణ, సుఖసంతోష ప్రాప్తి కలుగును. ఈవ్రతం రోహీణీ నక్షత్రం, బుధవారంములో వచ్చినట్లయితే కోటి వ్రతఫలం, సర్వత్ర విజయం, మాతాపితృ పూజాఫలం, గురుపూజాఫలం కలుగును అని బ్రహ్మచెప్పగా నారదుడు విని, ఓ పితామహా!ఈ కృష్ణ జయంతి వ్రతం ఎలా చేయాలి? ఆ విధానము ఉపదేశించును అని అడిగాడు.

అందులకు బ్రహ్మ దేవుడు పూర్వకాలములో సనత్కుమారుడు, హరిశ్చంద్రునికి ఈ వ్రతం ఉపదేశించి ఏ వ్రతమైన నియమముగా చేచినట్లయితే సఫలం కలుగును. నియమములేని పూజా వృధాయగును. శ్రీకృష్ణాష్టమి రోజున భక్తిపూర్వకమయుగా పూజాచేసి ఉపవాసించేవారికి మధ్యాహ్న సమయమున పుత్రాది వర్ధకమైన తిలామలక స్నానమాచరించి, తులసీ మిశ్రతమైన జలమున స్పృశించి, మధ్యాహ్నం కృత్యములు నిర్వర్తించి పరిశుద్ధ సమాహితబుద్ధుడై గృహమద్యమునగాని విష్ణుదేవస్ధానమున గాని గోమయముచే స్ధలశుద్ధి చేసి అలంకరించి శుద్ధజలపూరితములను నవరత్నమునైన నూతన కుంభమును తండులములపై నుంచి గంధపుష్పాదులతో, అక్షతలతో నలకరించి నూతన వస్త్రమును చుట్టి, వెండి రాగి లేక మట్టితో చేయబడిన ఆ కలశమందు కర్షమాత్ర సువర్ణముతో చేయబడిన బాలకృష్ణ ప్రతిమనుంచి యధావిధిగా శక్తికొద్ది పూజించవలెను.

శ్రాద్ధ, దన, హొమ, తీర్ధవ్రతాదులలో చేసుకోవాలి. ఉన్నంతలోనే గురువాక్యమును వదలి అధర్మమును స్వేచ్చగా ఆచరించేవాడు. పరమాత్మసన్నిధి చేరలేడు. కావున ధర్మమునైనను ధర్మవిధిగా ఆచరించుట శ్రేయస్కరం.విష్ణు సాయుజ్యం పొందుతారు. శ్రీ బ్రహ్మండ పురాణమునందలి బ్రహ్మనారద సంవాదమునందలి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: