telugudanam.co.in

      telugudanam.co.in

   

శ్రీ వైభవలక్ష్మీ పూజ వ్రత కధ

[ వెనుకకు ]


వైభవలక్ష్మీ

క్షీర సముద్రరాజతనయా, శ్రీ లక్ష్మీ, హరివల్లభ, విద్యాలక్ష్మి, రమా, వైభవలక్ష్మీ, సాంప్రదాయినీ, శ్రీ చక్ర విలసిని, యోగమాత, ప్రకృతి స్వరూపిణీ, జగద్రక్షిణీ అని అనేక నామములతో విరాజిల్లుతున్న శ్రీలక్ష్మిదేవి యైక్క పూజాకధను తెలుసుకుందాము.

వేదములలో లక్ష్మిదేవి యెక్క స్తవన రూపమును అనుసరించి సూక్తములు వివరించబడినవి.లక్ష్మిదేవి యైక్క స్వరూపాన్ని అధర్వణవేదం చాలా చక్కగా తెలియజేయుచున్నది.అదే అధర్వణ వేదమునందు ఫలములను నిర్దేశించే లక్ష్మీ హృదయము ఉపదేశించ బడినది.పద్మ పురాణం,విష్ణూపురాణాలలో మరియునూ భగవత మకరందమునందు జగన్మాత మహత్యం గడచిన, కృతయుగము,త్రేతాయుగము, ద్వాపరయుగములలో సకలదేవత సముదాయముల చేతను కశ్యపుడు, అత్రి, భృగువు, ఆగస్త్య ఆదిగాగల మహఋషులచేతను వైభవలక్ష్మి పూజింపబడినది.అమితముగా కీర్తింపబడినదనుటకు ఆధారాలున్నాయి. అనాదిగా శ్రద్ధాసక్తులు, భక్తిని అనుసరించి వైభవలక్మి తన కృపావీక్షణలను అందచేస్తూనే వుంది.

పూర్వకాలమున అమృతము కొరకు దేవతలు, రాక్షసులు పాలసముద్రమును చిలుకు సమయమున ముందుగా లక్మిదేవి పాలసముద్రము నుండి ఉద్భవించిన. అందుకే ఆమె క్షీరరాజతనయ అని పిలవబడుతున్నది. తరువాత కామధేనువు,కల్పవృక్షము హాలాహలము,చివరిగా అమృతము లభించినవి.ఈ విధంగా ఉద్భవించిన శ్రీమహవైభవలక్ష్మిని మనసారాపూజించిన సకల జనులకు ఈ జన్మమునసర్వసుఖములు పరమందు మోక్ష సిద్ధి కలుగుతాయి. కరుణావీక్షణము చేతనే సకల సౌఖ్యముల సమకూర్చగల శ్రివైభవలక్ష్మి వైకుంఠమున శ్రీమహావిష్ణువు పై కినుక వహించి,భూఅలోకమున అవతరించినది.తన హృదయాన్నే శ్రీకి నిలయం చేసుకున్న మహావిష్ణువు,ఆ తల్లిని విడచి వుండలేక తానునూ భూలోకమునకు విచ్చేసినారు.సర్వార్ధసిద్ధికి,సకల వరసిద్ధికి,కారణభూతులయిన వీరిరువురూ,భక్తి ప్రపత్తులు గల మానవకోటికి సిరిసంపదలు,సకల సౌఖ్యములను లభింపచేయుటకే,కారణములు కల్పించుకుని భూమిపై అవతరించిరి.అదే ఆ జగన్మోహనుల లీల,ఘటనాఘటన సమర్ధులు కనుక మానవాళికి సౌఖ్యములు ప్రసాదించుటకు సంకల్పించిరి.అహంకారము,తిరస్కార భావములు కలవారికి మాత్రము వీరు అనుగ్రహము కలుగుట అసంభవము. ఇది నిస్సంశయము.

నీవు తప్ప నాకేవ్వరు దిక్కని స్తుతించిన వారికి అన్నిటా ఆవైభవలక్ష్మితోడై అండగా నిలుస్తుంది.భాగ్యం కోసం ఆ తల్లినుఇ ఆరాదించిన వారికి,ఆ మాత బోగభగ్యములను ప్రసాదించే సకల వరప్రదాయిని అవుతుంది.నిస్సంతులు పుజించినచోసంతానలక్ష్మిగా తన అనురాగమును పసతానమును కలిగించును.విజయము కొరకు ప్రార్ధించిన జయలక్ష్మి అయి విజయాన్ని కలిగిస్తుంది.పాండిత్యము కొరకు పూజించిన వారికివిద్యాలక్ష్మిగా సర్వశాస్త్ర పారంగతులను చేసే తల్లి.ధనము కొరకు పూజించే వారికి ధనలక్ష్మి కోరికలు నెరవేర్చే కరుణామూర్తి. పంటలు లేక బాధపడేవారు పూజించిన,ధాన్యమునిచ్చు ధన్యలక్ష్మి.పిరికితనము పొకొట్టు దైర్యలక్ష్మి నిత్యజీవితావసరాలను ఆశించి ప్యజించువారికి అండగా నిలిచి కాపాడే ఆదిలక్ష్మి. ఆ తల్లి యెక్క అష్టరూపాలను ఎవరైతే భక్తిగా,శ్రద్ధగా నియమములతో పూజిస్తారో వారికి తప్పకుండా ఆ తల్లి యెక్క అనుగ్రహము లభిస్తూందనటలో సంశయము లేదు.అశ్ఠలక్ష్మి పూజను చేసి లక్ష్మి పూజాకధను విని,ప్రసాదమును స్వీకరించిన వారి కోరికలు తప్పక నెరవేరగలవు.

ఆశామోహములకు తలఒంచకుండా,ధర్మ అర్ధకామ మోక్షముల యేక్క అంతరార్ధమును గ్రహించి, పూజించిన ప్రతి ఒక్కరూ శ్రీవైభవలక్ష్మి మాత యైక్క దయను పాత్రులయి సర్వౌఖసౌఖ్యములను పొదగలరు. అరాచకులు,దుర్మార్గుల పాలిటి మహాకాళి ఈ తల్లి.భయ,భక్తులతో మెలిగే సన్మార్గులపట్ల కరుణ కురిపించగల దయామయి వైభవలక్ష్మి అంటే పూర్ణశక్తి స్వరూపిణిగా గ్రహించగలగాలి.ఇది వైభవలక్ష్మి పూజాక్రమము.


శ్రీలక్ష్మి స్తోత్రం

శ్రీ మన్మహాలక్షెంత్య

బ్రాహ్మీం చ వైస్ణవీ భద్రాం షడ్భుజాం చ చతుర్ముఖాం

త్రినేత్రాం చ త్రిశూలాం చ పద్మచక్రగదాధర

ప్రధమే త్ర్యంబకాగౌరీ ద్వితీయే వైష్ణవీ తథా

త్రుతీయే కమలా ప్రోక్తా, చతుర్థే లోకసుందరీ

పంచమే విష్ణు పత్నీచ,షష్టేచవైష్ణవీ తథా.

సప్తమే చ వరారోహా అష్టమే వరదదాయిని.

శ్రీలక్ష్మ్యష్టకం నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే,

శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి ర్నమోస్తు తే.

నమస్తే గరుడారూఢే దేవాసుర భయంకరి!

సర్వపాపహరే దేవి మహలక్ష్మి ర్నమోస్తు తే.

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి!

సర్వభగ్యప్రదేదేవి!మహాలక్ష్మి ర్నమోస్తు తే.

సిద్ధి బుద్ధిప్రదేదేవి భుక్తిముక్తి ప్రదాయిని,

మంత్రమూరెత సదాదేవి మహలక్ష్మి ర్నమోస్తు తే.

ఆద్యంతరహితేదేవి ఆదిశక్తే మాహేశ్వరి,

యోగజ్ఞే యోగసంభూతే మహలక్ష్మి ర్నమోస్తు తే.

స్ధూలసూక్ష్మే మహారౌద్రే నహాశక్తే మహాఒదరే,

మహాపాహరే దేవి మహాలక్ష్మి ర్నమోస్తు తే.

పద్మాసనస్ధితే దేవి పరబ్రహ్మస్వరూపిణి,

పరమేశే జగన్మత ర్మహాలక్ష్మి ర్నమోస్తు తే.

శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే,

గత్‌స్ధితే జగన్మత ర్మహాలక్ష్మి ర్నమోస్తుతే.

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠే ద్భక్తిమా న్నరః!

సర్వసిద్ధి మావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా.

ఏకకాలే పఠే న్నిత్యం ధనధాన్యసమన్వితః

త్రికాలం యః పఠ నిత్యం మహాశత్రువినాశనం,

మహాలక్ష్మీర్ భవేన్నిత్యం సర్వదా వర్దా శుభా.

ఇతి ఇంద్రకృత శ్రీ మహాలక్ష్మ్య ష్టకస్తవః సంపూర్ణంః

దేవి దేహీ ధనం దేహి దేవి దేవీయశో మయి,

కీర్తిం దేహి సుఖం దేహీ ప్రసీద హరివల్లభే.

శ్రీ లక్ష్మినారాయణ ప్రసాదసిద్ధిరస్తు.

సర్వకామ్యార్ధఫలసిద్ధిరస్తు.

మనోభీష్టాఫలసిద్ధిరస్తు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: