telugudanam.com

      telugudanam.com

   

చిట్కాలు

 

చిట్కా.. మన సంస్కృతి!

ఏ సమస్య తలెత్తినా మనవాళ్లు చాలామంది ' చిట్కా వైద్యాల ' కోసం చూస్తుంటారు. డాక్టర్ దగ్గరకు వెళ్ళటానికి బద్ధకించి కాదు, డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేకా కాదు, సమయమూ డబ్బూ దండిగా ఉన్నవాళ్లు కూడా ఇలా ఇంటి చిట్కాలను... పెరటి వైద్యాలను ఆశ్రయిస్తుండటానికి కారణం...?

దీనికి సమాధానం వేక్‌ఫారెస్ట్ యూనివర్సిటీ పరిశోధనల్లో ఇప్పుడిప్పుడే వెల్లడవుతున్నట్టనిపిస్తోంది!

తలనొప్పి అనగానే మన బామ్మగారు నుదురుకు ఇంగువపట్టు వేసేస్తారు. పొట్టలో తేడాగా ఉంటే వెంటనే ఇంట్లో వాము కషాయం పెట్టేస్తారు. ఇలా మన ఇళ్లలో పద్దతరం, పాతతరం మనుషులు ఎక్కువగా ఇంటి చిట్కాలను ఆశ్రయిస్తుండటం చూస్తూనే ఉన్నాం. నిజానికి ఈ ధోరణి ఒక్క మన ఇళ్లలోన కాదు... ప్రపంచవ్యాప్తంగా అన్ని సమాజాల్లోనూ ఉందని ఇటీవల వేక్‌ఫారెస్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు నిగ్గుతేల్చారు. ముఖ్యంగా ఈ ఇంటి చిట్కాలను ఆశ్రయించటమన్నది కాస్త బలమైన సాంస్కృతిక నేపధ్యం, చరిత్ర గల సమాజాల్లో ఎక్కువని వీరు గుర్తించారు. ఇక ఈ అలవాట్లు ఏళ్ల చరిత్ర గల చిన్నచిన్న తెగల్లో మరీ ఎక్కువగా కనబడుతున్నాయి. దీనికి పేదరికాన్నే కారణంగా చూడకూడదనీ, ప్రధానంగా సాంస్కృతిక నమ్మకాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను 'అమెరికన్ జర్నల్ ఆఫ్ హెల్త్ బిహేవియర్' జనవరి సంచిక ప్రచురించింది.

వీరు పరిశీలించిన చాలా జాతుల్లో తేనె, పసుపు, సబ్జాగింజలవంటి వాటిని చిట్కా వైద్యాలుగా విరివిగా వాడుతున్నారు. కొన్ని వయస్సులు, జాతులుతెగలవారిలో ఇంటి చిట్కాలను అశ్రయిస్తున్నారా? లేక ఆధునిక వైద్యాన్ని భరించే ఆర్ధిక స్థోమత లేకా? ప్రభుత్వాల వైద్య విధానాల్లో వివక్ష కారణంగానా? ఇలా ఎన్నో అంశాలను పరిశీలించిన పిమ్మట... చివరికి బలమైన సాంస్కృతిక విశ్వాసాలు, అలవాట్లే మిగతావాటికంటే ముఖ్యప్రాముఖ్యత పోషిస్తున్నాయని వీరు గుర్తించారు. " వైద్యపరంగా, ఆరోగ్యపరంగా ప్రజల అలవాట్లు, నమ్మకాలన్నవి వారు ఏ ప్రాంతంలో ఉంటున్నారు, ఏ జాతివారు, వారి సాంస్కృతిక నేపధ్యం ఏమిటన్న దాని మీద చాలా ఎక్కువగా ఆధారపడి ఉంటున్నాయని మా ఈ అధ్యయనం స్పష్టంగా చెబుతోంది"


బంగారు మాట: ఒక వర్గం ప్రజలను అణగిదొక్కి ఉంచే అధికారం మరొక వర్గానికి లేదు. కులం పునాదుల మీద మీరు దేనినీ నిర్మించలేరు. ఒక జాతిని నిర్మించలేరు. నీతిని నిర్మించలేరు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: