telugudanam.co.in

      telugudanam.co.in

   

ఆలూ పాపడ్

[ వెనుకకు ]

కావలసిన వస్తువులు:

బంగాళదుంప కూర - చిన్న కప్పు
అప్పడాలు - నాలుగైదు
జీలకర్ర పొడి - ఒక చెంచా
ఉప్పు - తగినంత
కారం - ఒక చెంచా
ఆంచూర్ - ఒక చెంచా
నూనె - వేయించటానికి సరిపడా
కొత్తిమీర తరుగు - ఒక చిన్న కప్పు
టమాటాసాస్ - తగినంత
 

తయారు చేసే విధానం:

బంగాళదుంప కూరను బాగా మెత్తగా చేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆంచూర్, జీలకర్ర పొడి కలపాలి. ఇప్పుడు అప్పడాలను తీసుకొని మద్యలో బంగాళదుంప కూర పెట్టి, నాలుగువైపులా మడిచి చేతికి తడి చేసుకొని అతికించాలి. ఈ లోగా బాణీలో నూనెపోసి బాగా కాగాక, వీటిని వేసి వేయించి తీయాలి. చివరిగా కొత్తిమీరతో అలంకరిస్తే, ఆలూ పాపడ్ రెడీ, వీటిని వేడివేడిగా సాస్ తో తినాలి.p

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: