telugudanam.co.in

      telugudanam.co.in

   

బీరకాయ బజ్జి

[ వెనుకకు ]

కావలసిన వస్తువులు:

బీరకాయలు - రెండు
శనగపిండి - 1 కప్పు
బియ్యప్పిండి - అర కప్పు
నూనె - 2 కప్పులు
వంటసోడా - చిటికెడు
కారం - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
 

తయారు చేసే విధానం:

ముందుగా బీరకాయలు తొక్కు తీసి చక్రాల్లా కోసుకోవాలి. బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, కారం, వంటసోడా కలిపి నీళ్లు పోసి జారుగా కలపాలి. స్టవ్‌మీద కళాయి పెట్టి నూనె పోసి బాగా కాగిన తరవాత ఒక్కో బీరకాయ ముక్కని శనగపిండిలో ముంచి నూనెలో వేయించాలి. ఎర్రగా వేయించి తీశాక టమోటా సాస్‌తో వడ్డించాలిి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: