telugudanam.co.in

      telugudanam.co.in

   

మినపచెక్క వడలు

[ వెనుకకు ]

కావలసిన వస్తువులు:

నల్ల మినుములు - 500 గ్రా
జీలకర్ర - 10 గ్రా
మిరియాలు - 5 గ్రా
పచ్చిమిర్చి - ఆరు
కొత్తిమీర - 2 కట్టలు
ఉల్లిపాయలు - రెండు
ఉప్పు - తగినంత
రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి సరిపడినంత
 

తయారు చేసే విధానం:

మినుముల్ని నానబెట్టండి. తరువాత జల్లెడలో వడగట్టి గంటసేపు ఆరబెట్టండి. కాస్త తడిగా ఉన్న మినుముల్లో మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి గట్టిగా రుబ్బండి. ఈ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, ఉప్పు కలపండి. మినప్పిండిని ముద్దలుగా చేసి నూనె పూసిన ప్లాస్టిక్ కాగితం మీద పలుచగా అద్దండి. ఈ పచ్చి వడలపైన తురిమిన కొత్తిమీర అద్దండి. కాగుతున్న నూనెలో వేయించండి. వడలు వేయించేటప్పుడు మంట సన్నగా ఉండాలి. కరకరలాడేలా తయారైన మినప చెక్క వడల్ని చల్లారిన తరవాత మూత గట్టిగా ఉన్న డబ్బాల్లో వేసుకోండి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: